తెలంగాణ, సామాజిక స్పందన
ఖమ్మం జీల్లచెర్వులో ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకుడు శేఖర్ ఏర్పాటు చేసిన ఎడ్ల పందేలు,కబడ్డీ పోటీలకు రవిచంద్ర ఎంపీ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ మధుతో కలిసి అతిథిగా హాజరయ్యారు.
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు నాయకత్వంలో రైతు రాజ్యం కొనసాగుతున్నదని, దండుగ అనుకున్న వ్యవసాయాన్ని ఆయన పండుగ అని ఆచరణలో నిరూపించిన మహానేత అని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.రైతులు,వ్యవసాయ రంగం కోసం ఈ తొమ్మిదేళ్ల పాలనలో నాలుగున్నర లక్షల కోట్లు ఖర్చు చేశారని వివరించారు. ఉచిత విద్యుత్,ఉచిత సాగునీరు,పంట పెట్టుబడిగా ఎకరాకు ఏటా 10వేల చొప్పున ఉచితంగా అందించడం,రైతుబీమాను అమలు చేయడం ఒక తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా కూడా లేదన్నారు.ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెర్వు సీతారామ చంద్రస్వామి ఆలయం చెంత శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన ఎడ్ల పందేలు,బాలికల కబడ్డీలకు ఎంపీ రవిచంద్ర అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,అందుకే దేశంలోని రైతులు,అన్ని వర్గాల ప్రజలు మహానేత కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు బీఆర్ఎస్ లో చేరుతున్నారని రవిచంద్ర పేర్కొన్నారు.ఎడ్ల పందేలు,కబడ్డీ పోటీలలో విజేతలైన వారికి ఎంపీ వద్దిరాజు లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డితో కలిసి బహుమతులు ప్రదానం చేశారు.
@@@@@ మరిన్ని వార్తలు చదవండి @@@@@@
ఏపీలో ప్రేమ జంట ఆత్మహత్య & తెలంగాణలో కలుషిత నీరు తాగిన కూలీల కలకలం !!
ఆంధ్రప్రదేశ్, సామాజిక స్పందన
తమ ప్రేమని పెద్దలు కాదనడంతో యువ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి రైల్వేగేటు వద్ద చోటు చేసుకుంది.
స్థానికులు, రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. సెలపాడు గ్రామానికి చెందిన ఉయ్యూరు శ్రీకాంత్.. అదే గ్రామానికి చెందిన పులి త్రివేణి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. త్రివేణి రెండురోజుల క్రితం తెనాలిలోని డిగ్రీ కళాశాలకు వెళ్లింది. ఆ తర్వాత శ్రీకాంత్‌తో వెళ్లడాన్ని గమనించిన స్నేహితురాలు.. త్రివేణి తల్లిదండ్రులకు సమాచారమిచ్చింది..
దీంతో మంగళవారం వారు చేబ్రోలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సుద్దపల్లి రైల్వేగేటు వద్ద మృతదేహాలను గ్యాంగ్‌మెన్ గుర్తించారు. త్రివేణి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతిచెందింది తమ కుమార్తే అని నిర్ధారించుకుని కన్నీరుమున్నీరయ్యారు. తెనాలి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
@@@@@@@@ మరిన్ని వార్తలు@@@@@@@@@
తెలంగాణ, సామాజిక స్పందన
ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పేడు గొల్లగూడేనికి చెందిన 24 మంది వ్యవసాయ కూలీలు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు..
ఆ గ్రామానికి చెందిన ఓ రైతు మిర్చి తోటలో పనికి వెళ్లిన కూలీలు భోజనం విరామ సమయంలో సమీపంలోని మరో రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలోని పైపుల వద్ద నీటిని సేకరించి తాగారు. కొద్దిసేపటికి పలువురు వాంతులు చేసుకోవడం, నాలుక తిమ్మిరిగా ఉండటం, కళ్లు తిరగడంతో ఆందోళన చెందారు.
ఈ క్రమంలో మిగిలిన కూలీలు ఆరాతీయగా రైతు తన పొలంలోని డ్రిప్ పైపులను శుభ్రపరిచేందుకు పాస్ఫరిక్ యాసిడ్ అనే రసాయన మందును ఉపయోగించారని.. ఆ పైపుల నుంచే నీరు విడిచిపెట్టినట్లు తేలింది. అస్వస్థతకు గురైన కూలీలందరినీ ట్రాక్టర్‌పై వెంకటాపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు, సిబ్బంది ప్రాథమిక వైద్యం అందించారు. ముగ్గురు కూలీలకు తీవ్రస్థాయిలో వాంతులు కావడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అస్వస్థతకు గురైన కూలీలందరికీ సామాజిక ఆసుపత్రిలోనే సేవలందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.












0 Comments