జై భీమ్ భారత్ పార్టీ పేరుతో నన్ను ఆర్థికంగా నష్టపరిచారు అంటూ న్యాయవాది మాదే సుజాత కీలక వ్యాఖ్యలు..

 

 

గుంటూరు జిల్లా, సామాజిక స్పందన

భారత ఎన్నికల కమీషన్ లో రిజిస్ట్రేషన్ లేని జై భీమ్ భారత్ పార్టీ పేరుతో మాజీ న్యాయమూర్తి,ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ఆర్థికంగా నష్టపరిచారని న్యాయవాది మాదే సుజాత అన్నారు.ఈరోజు గుంటూరులోని అంబేద్కర్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాదే సుజాత మాట్లాడుతూ 2019వ సంవత్సరంలో జై భీమ్ యాక్సిస్ జస్టస్ పేరుతో ఉన్న ఆర్గనైజేషన్ లో చేరామని అప్పటినుండి ప్రజల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశానని అనంతరం 07.07.2022లో జైభీమ్ భారత్ పార్టీ లో ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ కన్వినర్ గా నియమిస్తూ జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి అని చెప్పి జడ శ్రావణ్ కుమార్ నియామకపు పత్రం అందజేశారని అనంతరం 09.08.2022న జై భీమ్ భారత్ పార్టీ మీడియా అధికార ప్రతినిధిగా తనను నియమిస్తూ మరొక నియామకపు పత్రం అందజేశారని ఈక్రమంలో జై భీమ్ భారత్ పార్టీ పేరుతో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్,తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలకు ప్రజలను సమీకరించి వారందరినీ తరలించేందుకు వివిధ వాహనాలకు గాను గుంటూరు జిల్లాలో జై భీమ్ భారత పార్టీ కార్యాలయం స్థాపించేందు ఖర్చులకు గాను ఆర్థికంగా 12లక్షల రూపాయల వరకు సుమారుగా ఖర్చుపెట్టానని ఈ మధ్య కాలంలో తనను జై భీమ్ భారత్ పార్టీ పేరుతో జరిగే కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడంతో తమకు జైభీమ్ భారత్ పార్టీ పై అనుమానం వచ్చి తన స్నేహితుని చేత ఆర్టీఐ లో భారత ఎన్నికల కమీషన్ లో జై భీమ్ భారత్ పార్టీ పేరుతో రిజిస్ట్రేషన్ జరిగిందా?లేదా అని రాత పూర్వక వివరణ అడిగిన క్రమంలో 19.04.2023న భారత ఎన్నికల కమీషన్ వారు జై భీమ్ భారత్ పార్టీ పేరుతో తమ వద్ద ఎటువంటి పార్టీ రిజిస్ట్రేషన్ జరగలేదని రాత పూర్వక సమాచారం అందించారని భారత ఎన్నికల కమీషన్ వారు ఇచ్చిన సమాచారంతో మాజీ న్యాయమూర్తి,ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ భారత ఎన్నికల కమీషన్ లో రిజిస్ట్రేషన్ లేని జై భీమ్ భారత్ పార్టీ పేరుతో మమ్ములను మోసగించడం పట్ల ఆందోళన చెందానని ఇప్పటికే ఈపేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రిజిస్ట్రేషన్ లేని జై భీమ్ భారత్ పార్టీ పేరిట వచ్చే వారిపట్ల రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా ఉండేలా జైభీమ్ భారత్ పార్టీ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కోట దయామణి,దాసరి ద్రాక్షావల్లి, గోదా రమేష్ తదితరులు పాల్గొన్నారు... 

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.