కోనసీమ, కొత్తపేట, సామాజిక స్పందన
జగన్ పాలనలో అన్ని రంగాలు కుదేలయ్యాయని కొత్తపేట నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. ఆలమూరు మండలం చెముడులంక గ్రామంలో *బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ* మరియు *రచ్చబండ* కార్యక్రమాల్లో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ ఇంఛార్జీ బండారు సత్యానందరావు పాల్గొని ఇంటింటికీ పార్టీ శ్రేణులతో కలసి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు మౌళిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారని అన్నారు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదని సత్యానందరావు అన్నారు.
చంద్రన్న భీమా లేదు, అన్నా కేంటీన్ లేదు, రంజాన్ తోఫా లేదు, క్రిష్మస్, సంక్రాంతి కానుకలు లేవు, విదేశీ విద్య లేదు, ఉన్నది ఒక్కటే ఒక్కటి కక్ష సాధింపు మాత్రమే.
చెముడులంక హైస్కూల్లో 18 రూములు టీడీపీ హయాంలో నిర్మిస్తే, ఈనాడు అదే హైస్కూల్లో నాడు-నేడు పేరుతో రంగులు వేసి, మైనర్ రిపేర్లు చేసి లక్షల రూపాయలు వైసీపీ వారు దోచుకున్నారని సత్యానందరావు దుయ్యబట్టారు.
ఈకార్యక్రమంలో గ్రామ, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జీలు, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత ఉభయ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.










0 Comments