నేను ఏదైనా మాటల్లో చెప్పను, నిలబడి చూపిస్తా: పవన్‌ కల్యాణ్‌.

  

ఏపీ, మంగళగిరి, సామాజిక స్పందన

తాను ఏదైనా మాటల్లో చెప్పనని.. నిలబడి చూపిస్తానని జనసేన  అధినేత పవన్‌ కల్యాణ్‌  అన్నారు. జనసేన కార్యకర్తలుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని, ఎన్ని కష్టాలు ఎదురైనా నిలబడ్డామన్నారు..

పవన్‌ సమక్షంలో శనివారం పలు పార్టీలకు చెందిన నాయకులు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలో చేరేందుకు చాలా మంది వస్తున్నారని.. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు..

''నిర్ణయాత్మక శక్తి ఉంటేనే ఏదైనా సార్థకమవుతుంది. విధానాలు రూపొందించే అధికారం రావాలి. బీసీ కార్పొరేషన్లకు కేటాయించిన నిధులు వారికే ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీ నిధులు వారికే వెళ్లాలి. ఎవరికైతే కేటాయించారో వారికే ఆ నిధులు వెళ్లాలి. ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టా. అణగారిన, అధికారం చూడని వర్గాలకు సాధికారత రావాలి'' అని పవన్‌ ఆకాంక్షించారు..


  @@@@@  మరిన్ని వార్తలు చదవండి @@@@@


నేడు ఒకే జిల్లాలో మోడీ, కేసీఆర్ పోటా పోటీ సభలు


హైదరాబాద్ , సామాజిక స్పందన

నేడు ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ఒకే జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్మల్ పట్టణంలో బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డికి మద్దతుగా మోడీ బహిరంగ సభలో పాల్గొననున్నారు..

మరోవైపు ఖానాపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ కు మద్దతుగా సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 12 గంటలకు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రధాని, సీఎంల సభల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, నేడు నాలుగు ప్రజా ఆశీర్వాద సభలలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇవాళ ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాకల్లో ప్రచారం నిర్వహించ నున్నారు. ఇప్పటి వరకు 86 సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. 27న షాద్ నగర్, చేవెళ్ల, అందోలు, సంగారెడ్డి. 28న వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలు కలిపి ఒకే చోట సభలు నిర్వహించనున్నారు. అనంతరం గజ్వేల్ సభతో సీఎం ప్రచారం ముగియనుంది..


     # ##########₹###₹###########₹###### #



బిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం: సీఎం కేసీఆర్


మంచిర్యాల, సామాజిక స్పందన :

రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని రైతు బంధు ఉండాలా వద్దా అనేది ప్రజలే చెప్పాలని సిఎం కెసిఆర్ అడిగారు టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మూడు గంటలు కరెంట్ చాలు అంటున్నాడని సాగుకు మూడు గంటల కరెంట్ సరిపోతుందా ప్రజలే చెపాలన్నారు.

శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ మాట్లాడారు బిఆర్‌ఎస్ అభ్యర్థి దివాకర్ రావుకు మద్దతు ఇవ్వాలని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామంటున్నాడని మళ్లీ విఆర్‌ఒ పటేల్ పట్వారీ వ్యవస్థలు రావాలా అని నిలదీశారు.

ఎన్నికలు వస్తే ఆగమాగంగా ఓటేయొద్దని సూచించారు నాలుగు చందమామలు ఆరు సూర్యుళ్లు తెస్తామంటే నమ్మొద్దని హితువు పలికారు.

ఓట్లను సద్వినియోగం చేస్తే వచ్చే ఐదేళ్లు మంచిర్యాల భవిష్యత్ బాగుంటుందని అన్నారు మంచి ఎంఎల్‌ఎలు గెలిస్తే మంచి ప్రభుత్వం వస్తుందని అభ్యర్థితో పాటు ఆ పార్టీ చరిత్ర కూడా పరిశీలించాలని కెసిఆర్ సూచించారు.

ప్రజలపై పార్టీల దృక్పథాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు బిఆర్‌ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని మడమ తిప్పకుండా పోరాడి తెలంగాణ సాధించుకున్నామని కెసిఆర్ గుర్తు చేశారు.

కాంగ్రెస్ చేసిన తప్పుకు 50 ఏండ్లు గోసపడ్డామని తలాపునే గోదారి ఉన్న మన చేను మన చెలక ఎడారి అని పాటలు రాశారని ఆనాడు రైతుల ఆత్మహత్యల భయంకరమైన వలసలు ఉండేవని అని మండిపడ్డారు మళ్లీ మనకు మంచి రోజులు రావాలంటే బిఆర్ఎస్ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.