తెలంగాణలో ఓటర్లకు మస్తు ఆఫర్లు, ఓటర్లు జర సోచాయించుండ్రి !!!

 

తెలంగాణ , సామాజిక స్పందన

పోలింగ్ కు మరో ఐదు రోజులే సమయం ఉండటంతో.. ఓట్ల కోసం నోట్ల పంపిణీ స్టార్ట్ అయింది. తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల పొలిటికల్ పార్టీలు ప్రలోభాలకు తెరతీశాయి..

ఖమ్మం జిల్లాలో హోరాహోరీగా పోరు జరుగుతున్న పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో ఒక ప్రధాన పార్టీ అభ్యర్థులు నగదు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఒక నియోజకవర్గంలో అయితే రాత్రికిరాత్రే పంపకాలు పూర్తైనట్లు తెలుస్తుంది. ఇక, ఆ రెండు నియోజకవర్గాల్లో ఒక చోట ఓటుకు రూ.3 వేలు ఇస్తే, మరోచోట రూ.2 వేల చొప్పున పంచారట. ఇటు హైదరాబాద్‌లోనూ కొన్ని నియోజకవర్గాల్లో డబ్బుల పంపకాలు ప్రారంభమయ్యాయి. శేరిలింగంపల్లిలో ఓ పార్టీ నేత ఓటుకు రూ.3వేల చొప్పున పంపిణీ చేస్తున్నారు. అటు వరంగల్‌ జిల్లాలోనూ భూపాలపల్లి, మహబూబాబాద్‌, పాలకుర్తి, వర్దన్నపేట నియోజకవర్గాల్లో ఓటుకు రూ.1000 నుంచి రూ.2 వేల దాకా డబ్బులు ఇస్తున్నారు..

గ్రామీణ ప్రాంతాల్లో డబ్బుల పంపకాలు స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. అధికారులు ఒకవైపు తనిఖీలు చేస్తున్నప్పటికి.. మరోవైపు డబ్బును ఒకే చోట నిల్వ చేయడం సురక్షితం కాదని ఎమ్మెల్యే అభ్యర్థులు అనుకుంటున్నారు.. డబ్బు పంపకాల వ్యవహారాన్ని చివరి రోజు రాత్రి వరకూ పెట్టుకుని టెన్షన్‌ పడడం కంటే ముందుగానే పంచేస్తే మంచిదనే అభిప్రాయంతో చాలామంది పంపకాలు చేస్తున్నారు. అయితే, డబ్బు పంపిణీలో ఒక్కో పార్టీది ఒక్కో విధానం అవలంభిస్తున్నారు. ఇప్పటికే, బీఆర్‌ఎస్‌ పార్టీ తన అభ్యర్థులకు భారీగానే ఫండింగ్‌ చేసింది. ఒక విడత నిధులను అభ్యర్థులకు ఇచ్చేసింది. ఇప్పుడు మిగతా నిధుల సర్దుబాటు కార్యక్రమం కూడా బీఆర్ఎస్ పార్టీ చక్కబెట్టేస్తున్నట్టు టాక్..

ఇదంతా మంచిగానే ఉంది కానీ పైసలు తీసుకొని ఓటేస్తే ఇంకా తరువాత నాయకులు పనులు చేసారా లేదా  అనేది సామాజిక స్పందన ప్రశ్న ?  ఇక దీనికి జవాబు తెలంగాణ  ప్రజల ఊహలకి వదిలేస్తాం ! ఓ ఓటర్లు జర సోచాయించుండ్రి! 👍

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.