నేను మాట ఇస్తున్నా.. ఇకపై తెలంగాణలోనూ తిరుగుతా..



వరంగల్, సామాజిక స్పందన

 ''తెలంగాణ నా గుండెచప్ఫుడు. ఇకపై తెలంగాణలో అడుగుపెడుతున్నాను. తెలంగాణ ధైర్యంతోనే ఆంధ్రాలో రౌడీలను, ఫ్యాక్షనిస్టులను ఎదుర్కొంటున్నాను'' అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు..


బుధవారం హనుమకొండ హాంటర్ రోడ్డులోని బీజేపీ విజయ సంకల్ప సభలో  పవన్ పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రాలో రౌడీలు రాజ్యామేలుతున్నారని.. గుండాల పాలన నడుస్తోందని విమర్శించారు. అలాంటి పరిస్థితుల్లో తట్టుకుని నిలబడుతున్నానంటే వరంగల్ పోరాటస్ఫూర్తే కారణమన్నారు. బలిదానాల తెలంగాణలో ఇంత అవినీతి ఉంటుందని తాను ఊహించలేదన్నారు. కమీషన్ల రాజ్యం నడుస్తోందని వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ పునర్ జన్మనిచ్చిందని తెలిపారు. పదేళ్లలో తాను తెలంగాణపై మాట్లాడలేదని అన్నారు. ప్రధాని అంటే తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. దశాబ్దం తర్వాత మాట ఇస్తున్నానని... వచ్చే ఏడాది నుంచి ఆంధ్రాలో లాగే తెలంగాణలోనూ తిరుగుతాను అని జనసేనాని స్పష్టం చేశారు..


బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారిలో తాను ఒక్కడినన్నారు. తెలంగాణలో జనసేన (Janasena) ఉంటుందని.. తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే జనసేన స్థాపించామని తెలిపారు. 2009లో స్థాపించిన పార్టీ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడటానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే కారణమని చెప్పుకొచ్చారు. నాడు తెలంగాణకు మద్దతు ఇచ్చిన వారిలో తాను ఒకడిని అని అన్నారు. బీజేపీ అభ్యర్థులు రావుపద్మ, ప్రదీప్ రావును గెలిపించాలని కోరారు. సమస్యలొస్తే తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయామని.. బీసీ ముఖ్యమంత్రినైనా చూడాలని అందుకే బీజేపీతో కలిసినట్లు తెలిపారు. జనసేన - బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు.


కాగా.. బీజేపీ విజయ సంకల్ప సభకు పవన్‌తో పాటు నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. జనసేనానిని చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు..

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.