జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వినియోగదారుల హక్కులపై విద్యార్థులకు అవగాహన




కాకినాడ జిల్లా, సామాజిక స్పందన

జాతీయ వినియోగదారుల దినోస్సవాలు సందర్బంగా పెద్దాపురం మండలం వడ్లమూరు జెడ్పి హై స్కూల్ నందు వి గిరిబాబు  గారి
అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యాతిధిగా
పెద్దాపురం కన్స్యూమర్ సంఘ అధ్యక్షులు భళ్లమూడి సూర్యనారాయణ మూర్తి స్టూడెంట్స్ చేత వినియోగదారుల ప్రమాణపత్రం చదివించి ప్రమాణం చేయించారు.. అనంతరం డివిజన్ స్థాయిలో పోటీలలో గెలుపొందిన స్టూడెంట్స్ కి సర్టిఫికెట్స్ ప్రధానంచేశారు. వివిధ వినియోగదారుల , చట్టాలపై అవగాహన కల్పించారు, అనంతరం ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో యు సంధ్యారాణి, జి వి రమణ, డి జానకి రామయ్య, కోఆర్డినేటర్,టీ కృష్ణవేణి, జి వి వి శేషుకుమార్, బి రమాదేవి, సీచ్ రాజేశ్వరి, ఐ రవికుమార్, తదితరులు
పాల్గొన్నారు.... 



     @@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@


డిశంబర్ 8 నుండి అంగన్ వాడీల సమ్మె, సిడిపివొకి సమ్మెనోటీసు ఇచ్చిన అంగన్ వాడీలు


  కాకినాడ జిల్లా, సామాజిక స్పందన

      డిశంబర్ 8 నుండి అంగన్ వాడీ లు నిరవదిక సమ్మెకు వెళ్ళుతున్నట్టు ఎ.పి.అంగన్ వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ ( సిఐటియు) ఆధ్వర్యంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పథక నిర్వాహణాదికారి ఉషాకి సమ్మె నోటీసు అందజేసారు. ఈ సందర్బంగా అంగన్ వాడీ యూనియన్ సమావేశం కాలే దేవి అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప్రాజెక్టు నాయ‌కులు త‌లారి నాగ‌మ‌ణి మాట్ల‌డుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగ‌న్‌వాడీల‌ను మోస‌గించింద‌ని అన్నారు. ఎన్నిక‌ల ముందు ప‌క్క‌క తెలంగాణా రాష్ట్రం క‌న్నా అద‌నంగా 1000 రూపాయ‌లు వేత‌నం పెంచుతామ‌న్నారని కానీ నేడు దాని ఊసే లేద‌ని అన్నారు.  స‌మ‌స్య ప‌రిష్కారం చెయ్య‌డం మానేసి అంగ‌న్‌వాడీల‌పై నిర్భందాన్ని ప్ర‌యోగిస్తున్నార‌ని అన్నారు. ఉద్య‌మాల‌ను అణ‌చాల‌ని ప్ర‌య‌త్నం చేసిన చాలా మంది కాల గ‌ర్భంలో క‌లిసిపోయార‌న్న విష‌యం ముఖ్యమంత్రి గుర్తించుకోవాల‌న్నారు. గ‌ర్బిణిల‌కు బాలింత‌ల‌కు ఇచ్చే పౌష్టికాహారం చాలా లోప‌
 ఉంద‌ని మంచి ఆహారాన్ని స‌రఫ‌రా చేయాల‌ని డిమాండ్ చేసారు. సుప్రీం కోర్టు తీర్పు ప్ర‌కారం అంగ‌న్‌వాడీల‌కు గ్రాట్యూటీ అమ‌లు చేయాల‌న్నారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం డిశంబ‌ర్ 8 నుండి జ‌రిగే స‌మ్మెకు ప్ర‌జానీకం అంద‌రూ మ‌ద్ద‌తు తెలియ‌జేయాల‌ని విజ్ఞ‌ప్తి చేసారు. అంగ‌న్ వాడీ వ్య‌వ‌స్ధ ఉంటేనే కొంత మేర‌యినా పౌష్టికాహారం అందుతున్న విష‌యం మ‌నంద‌రం గ్ర‌హించాల‌ని కోరారు. ఈ స‌మావేశంలో సిఐటియు నాయ‌కులు శ్రీ‌నివాస్‌, సూరిబాబు, టి.ఎల్‌. ప‌ద్మ‌, జ్యోతి, తుల‌సి, ల‌క్ష్మీ, ర‌మ‌ణ‌మ్మ త‌దిత‌ర‌లు పాల్గోన్నారు.


@@@@ మరిన్ని వార్తలు చదవండి @@@@


చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన,కాకినాడ EX మేయర్ పావని.

కాకినాడ జిల్లా, సామాజిక స్పందన

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నార చంద్రబాబు  హై కోర్టు లో బెయిల్ మంజూరు ఐన సందర్భంగా  EX మేయర్ & కాకినాడ జిల్లా  తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని తిరుమల కుమార్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయకత్వం వర్థిలాలని నినాదాలు చేస్తు ,చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి,   స్వీట్స్ పంపిణి  చేయటమైనది. 

 ఈ సందర్భంగా సుంకర పావని మాట్లాడుతూ

 "సత్యమేవ జయతే " సత్యం ఎప్పుడు గెలుస్తుందని సుంకర పావని ఆనందాన్ని వ్వక్తంచేశారు.

ఈ రోజు హై కోర్టు లో బెయిల్ మంజూరు ఐన సంధర్భంగా  చంద్రబాబు  త్వరలో సుప్రీం కోర్ట్ లో కేసు స్క్వాష్ చేయ్యటమవుతుందని, జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు పై పెట్టిన అక్రమకేసులు అన్నిటినుండి కడిగిన ముత్యం లా బైటకు వస్తారని పావని పేర్కొన్నారు.

సుంకర పావని తిరుమల కుమార్,

EX మేయర్ & కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.