తెలంగాణలో బారీ మెుత్తం లో డబ్బులు తరలింపు, కోట్ల రూపాయలు సీజ్ చేసిన పోలీసులు.

  

హైదరాబాద్ ,సామాజిక స్పందన

తెలంగాణలోఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి ఎలాగైనా అధికారంలోకి రావలన్న లక్ష్యంతో వ్యూహాలకు పదునుపెడుతూ దూసుకెళ్తున్నాయి.


ఇదే తరుణంలో ప్రలోభాల పర్వం కూడా స్పీడందకుంటోంది ఇలా తరలిస్తున్న డబ్బులను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.


శనివారం సాయంత్రం ఆరు కార్లలో డబ్బు తరలిస్తుండగా పోలీసులు తనిఖీలు చేసి పట్టుకున్నారు. మొయినాబాద్ అప్పా జంక్షన్‌ దగ్గర ఈ నగదు స్వాధీనం చేసుకున్నారు నగదు తరలిస్తోన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు డబ్బులను కార్లను సీజ్‌ చేశారు.


అయితే మొయినాబాద్‌లో దొరికిన డబ్బుపై పోలీసులు కీలక ప్రకటన చేశారు అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రేస్ కోర్స్ రఘురాం రెడ్డిదిగా పోలీసులు తేల్చారు మొత్తం రూ.7 కోట్ల 40 లక్షలు సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


శ్రీనిధిలో సోదాలు ముగిశాయి సోదాల్లో పలు కీలక వివరాలను అధికారులు సేకరించారు తెలంగాణ దంగల్‌లో ఓవైపు రాజకీయ వేడి మరోవైపు నగదు బట్వాడా ప్రకంపనలు రేపుతున్నాయి.


ఈసీ ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా నిఘాను పెంచారు పోలీసులు టచ్‌ చేస్తే తనిఖీల్లో క్యాష్‌ కట్టలు బుసలు కొడుతున్నాయి లెక్కా పత్రాల్లేకుండా తరలి స్తోన్న నగదు నగలను భారీగా స్వాధీనం చేసు కుంటున్నారు అలా సీజ్‌ చేసిన సొత్తు ఇప్పటికే 570 కోట్ల మార్క్‌ను క్రాస్‌ చేసింది.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.